మునుగోడు ఉపఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, టిఆర్ఎస్ కలసి పని చేశాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నేడు లెఫ్ట్ పార్టీ నేతలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. దేశంలో మోడీ కి వ్యతిరేఖంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. బీజేపీ పార్టీని నిలువరించగల పార్టీ టీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. తెలంగాణలో సజావుగా పాలన సాగకుడడు అనేది బీజేపీ ఉద్దేశమన్నారు జగదీశ్ రెడ్డి.
అందుకే మునుగోడు ఉపఎన్నిక తెచ్చిందన్నారు. లెఫ్ట్ శ్రేణులు ప్రచారం వల్లనే టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారన్న ఆయన.. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక ముందు కూడా అందరం కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..ఈ రోజు మాకు సంతోషంగా ఉందని.. ఒక పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడామన్నారు. రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు.. మళ్ళీ ఓడిపోయిన తర్వాత నైతికంగా మేమేం గెలిచాం అంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ని దిక్కు లేని పార్టీ గా చేశారని… కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కుట్ర చేశారని ఆరోపించారు.