BREAKING : ఆస్పత్రిలో చేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గొంతు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీ నుంచి తిరిగి రాగానే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ఆయన వైద్యపరీక్షలు చేయించుకున్నారు. రెండు రోజులు ఆస్పత్రిలో ఉండాలని డాక్టర్లు సూచించడంతో అడ్మిట్ అయ్యారు.

Minister Komati Reddy Venkat Reddy was admitted to the hospital with a sore throat

ఇది ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నిన్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి..నిన్న ఉమ్మడి ఏపీ భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీని ఆదుకోవాలని ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్‌ పార్లమెంట్‌లో హామీ ఇచ్చారని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. విభజన వేళ ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version