100 రోజుల్లో రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్​ను అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తమ హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వంద రోజుల్లోగా ఈ హామీని అమలు చేస్తామని మాటిచ్చారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌తో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 3-4 వేల కోట్ల భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరోవైపు రైతులకు క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్‌ హామీల అమలుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. రేషన్‌ కార్డులపై పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.

పౌరసరఫరా శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. సంస్థ ఆర్థిక పరిస్థితి, ధాన్యం సేకరణ, మిల్లింగ్‌, రేషన్‌ పంపిణీ తదితరాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైస్‌ మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో జాప్యం ఎందుకు జరుగుతోందని నిలదీశారు. కిలోకు రూ.39 ఖర్చుచేసి రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్నామని, పేదలు ఆ బియ్యం తిననప్పుడు ఈ పథకం లక్ష్యం దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. ధాన్యం కొనుగోలులో లోటుపాట్లను సరిచేసుకోవాలని అధికారులకు ఉత్తమ్ సూచించారు. ధాన్యం అమ్మిన రైతు ఖాతాలో వెంటనే డబ్బు జమ చేయాలని, సేకరణ పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version