అడవులు, పర్యావరణ పరిరక్షణ పెంచేందుకు కలిసికట్టుగా పనిచేస్తాం : మంత్రి కొండా సురేఖ

-

రాష్ట్రంలో అడవులు, పర్యావరణం రక్షణకు, పచ్చదనం మరింతగా పెంచేందుకు కలిసికట్టుగా పనిచేస్తాం తెలిపారు మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా  ఉదయం  సోమవారం, డిసెంబర్ 11న 10 గంటలకు కొండా సురేఖ బాధ్యతలు చేపట్టనున్నారు. సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410) పూజలు చేసి బాధ్యతలు స్వీకరిస్తారు.

అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు మంత్రిని ఆమె నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పర్యావరణం, అడవుల రక్షణకు, పచ్చదనం మరింతగా పెంచేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. అంతకు ముందు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఇతర అధికారులు, పండితులు మంత్రి దంపతులను కలిసి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. రేపు ఢిల్లీకి వెళ్లి భువనగిరి ఎంపీ పదవీకి రాజీనామా చేయనున్నారు కోమటిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version