ఎట్లుండే సిరిసిల్ల… ఇప్పుడు ఎలా అయ్యింది – KTR

-

ఎట్లుండే సిరిసిల్ల… ఇప్పుడు ఎలా అయ్యింద అని మంత్రి KTR పేర్కొన్నారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… సిరిసిల్లలో నామినేషన్‌ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. నాకు రాజకీయ భిక్షని ఇచ్చిన నియోజకవర్గం సిరిసిల్ల.. సిరిసిల్ల ‌ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచి సిరిసిల్లను అభివృద్ధి చేశానని వివరించారు.

Minister KTR filed nomination in Sirisilla

సిరిసిల్ల జిల్లా ప్రజలు తల ఎత్తుకునే విధంగా పనిచేశానని చెప్పారు. ఎట్లుండే సిరిసిల్ల ఇప్పుడు ఎలా అయ్యింది..తెలంగాణ రాష్ట్రంలో ‌సిరిసిల్ల అభివృద్ధిలో‌ ముందు ఉన్నామని వివరించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేశాను.. గౌరవ మెజారిటీతో తిరిగి ‌గెలిపిస్తారని నమ్మకం ‌ఉందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. భవిష్యత్తులో కూడా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version