నామినేషన్‌ వేయకుండా అడ్డుకుంటున్నారని ఈసీకి పొంగులేటి ఫిర్యాదు

-

తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ జోరందుకుంది. ఈరోజు మంచి ముహూర్తం ఉండటంతో ప్రధాన పార్టీల్లోని కీలక నేతలంతా ఇవాళే నామినేషన్ దాఖలు చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్​లో నామపత్రాలు సమర్పించారు. అనంతరం కామారెడ్డికి నామినేషన్ వేయడానికి వెళ్లారు. మరోవైపు సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ నామినేషన్ వేశారు.

ponguleti

ఇంకోవైపు కాంగ్రెస్ నేతలు కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే ఈరోజు నామినేషన్ వేయాలని భావించి రంగం సిద్ధం చేసుకున్న మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు తెల్లవారుజాము నుంచి ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. తనను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి తనపై కుట్రపన్నారని మండిపడ్డారు. బీజేపీలో చేరలేదని.. బీఆర్ఎస్​ను వీడాననే కారణంతో.. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటోదన్న కోపంతో తనపై ఐటీ దాడులు చేయిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version