కంటోన్మెంట్ పై మ‌రోసారి మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

-

సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ బోర్డ్ పై మంత్రి కేటీఆర్ మ‌రో సారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అక్క‌డ క‌నీస వ‌స‌తులు క‌ల్పించ‌కపోతే.. జీహెచ్ఎంసీ లో విలీనం చేయాల‌ని అన్నారు. జీహెచ్ఎంసీ లో విలీనం చేస్తే తామే కంటోన్మెంట్ ను అభివృద్ధి చేస్తామ‌ని అన్నారు. కాగ కంటోన్మెంట్ బోర్డు ఇటీవ‌ల అధికారులు రోడ్లు ను మూసివేశారు. దీని పై మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ ద్వారా కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, రాజ్ నాథ్ సింగ్ ల ను ట్యాగ్ చేస్తు ఈ వ్యాఖ్య‌లు చేశారు. కంటోన్మెంట్ రోడ్ల‌ను అక్ర‌మం గా మూసి ప్ర‌జ‌లను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని అన్నారు.

అసలు కంటోన్మెంట్ పై కేంద్ర ప్ర‌భుత్వం ఎందుకు స‌రి అయిన చర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. సికింద్రాబాద్ లోని మిలిట‌రీ అధికారులు నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే కేంద్ర ప్ర‌భుత్వం ఏం చేస్తుంద‌ని అన్నారు. లోక్ స‌భ లో రెండు రోడ్ల ను మాత్ర‌మే మూసి వేశామ‌ని కేంద్ర మంత్రి చెప్పార‌ని అన్నారు. నిజానికి 21 రోడ్ల ను మూసివేశారని కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ ప్ర‌జ‌ల‌కు క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌క పోతే జీహెచ్ఎంసీ లో విలీనం చెద్దామ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version