అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు : మంత్రి పొంగులేటి

-

అవినీతి అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖలో అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇస్తే కొందరు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి అధికారులను చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. అవినీతి అధికారుల గుట్టురట్టు చేసేందుకు ఏసీబీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

మరోవైపు ధరణి సమస్యల గురించి మాట్లాడుతూ.. ఈ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడే విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వెల్లడించారు. ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీయైనా ప్రభుత్వ ఆస్తులు విషయంలో ఒకే విధమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఈ దూకుడు మూణ్నాళ్ల ముచ్చట అసలే కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version