ఇంకా వెయ్యి కోట్లు మాఫీ చేయడానికి మేము సిద్ధం..!

-

కేసీఆర్ తెలంగాణ ధనిక రాష్ట్రం అన్నారు కానీ… ఖజానా మాత్రం ఖాళీ. మేము అధికారంలోకి వచ్చిన కొత్తలో అప్పు చూసి షాక్ అయ్యం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు .రైతుల రుణమాఫీ .. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని రీతిలో చేశాం. దుబారా ఖర్చులు దూరం పెట్టీ రైతును రాజు చేసే పనిలో పడ్డాము. 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం. 31 వేల కోట్లు మాఫీ కోసం అవసరం అవుతాయని అంచనాతో సిద్ధం అయ్యాం. 18 వేల కోట్లు ఇచ్చాము..ఇంకో 12 వేల కోట్లు రైతులకు అందాల్సి ఉంది.

అయితే కొందరు రైతులకు టెక్నికల్ కారణాలతో మాఫీ కాలేదు. వాళ్లకు కూడా మాఫీ అవుతుంది. ఇక త్వరలోనే 2 లక్షల పై బడి రుణం ఉన్న రైతులకు గడువు పెట్టబోతున్నాం. గడువు లోపు బాకి చెల్లించిన తర్వాత 2 లక్షల రుణమాఫీ అవుతుంది. గత ప్రభుత్వం మాదిరిగా మాటలు చెప్పం.. ఇంకో వెయ్యి కోట్లు ఐనా మాఫీ చేయడానికి సిద్ధం గా ఉంది మా ప్రభుత్వం అని పొంగులేటి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version