సొంత నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతులకు నీళ్లు ఇప్పించలేకపోతున్నారు. దింతో కడుపు మండి అధికారులను పక్కకు నెట్టి పాలేరు గేట్లు ఎత్తేసారు రైతులు. అసలు వివరాలు ఇలా ఉన్నాయి. పాలేరు – కూసుమంచి మండలంలోని పాలేరు పాత కాలువ కింద సుమారు 10 వేల ఎకరాల వరి సాగు చేయగా ప్రస్తుతం పైరు పొట్ట దశలో ఉంది. వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి పొలాలు ఎండిపోతున్నాయి.
సాగర్ జలాలు రప్పించి కనీసం మూడు తడులైనా ఇవ్వాలని నెల రోజులుగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రైతులు కోరుతున్నారు. నీటి విడుదల చేయడం సాధ్యం కాదని భావించి కూసుమంచి, నేలకొండపల్లి మండలాల రైతులు పెద్ద ఎత్తున చేరుకుని తాళాన్ని పగలగొట్టి మూడు గేట్లు పైకెత్తి కాలువలోకి నీళ్లు వదిలారు. గేట్లు కిందకి దించడానికి ప్రయత్నించిన అధికారులతో మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.