బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు ప్రూవ్ చేస్తే కరీంనగర్ బరి నుంచి తప్పుకుంటాం : పొన్నం

-

రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకు వేడి రాజుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఓవైపు బీఆర్ఎస్.. మరోవైపు బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టాయి. ఆరు గ్యారంటీల అమలుపై హస్తం పార్టీలను ఎండగడుతున్నాయి. తాజాగా సిద్దిపేటలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి హస్తం సర్కార్పై మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానంటున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్… పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే కరీంనగర్ లోక్సభ ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్ తప్పుకుంటుందని తెలిపారు.

సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్ లో పలువురు బీఆర్ఎస్ తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ బీజేపీ ఎంపి అభ్యర్థి బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించేలా కార్యకర్తలందరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version