తెలంగాణ రాష్ట్రంలో కొత్త పింఛన్లు రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పింఛన్ల అర్హుల జాబితాను సిద్ధం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గత సర్కారులో పెండింగులో ఉన్నవి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా అర్హుల లిస్ట్ రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో సూచించారు.
అలాగే చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ఇక అటు తెలంగాణ యువతను ప్రపంచంలోనే మెరుగైన నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తుండగా, ‘స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఐటీ కంపెనీలతో పాటు అధునాతన పరిశ్రమలన్నింటికి అందుబాటులో ఉన్నందున గచ్చిబౌలి ప్రాంతంలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.