కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లపై మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త చెప్పారు. ఈనెల 28 నుంచి ‘ప్రజా పాలన’ గ్రామ సభల్లో రేషన్ కార్డుల అప్లికేషన్లు కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
‘గ్రామ సభల్లో ఆరు గ్యారెంటీలతో పాటు రెవెన్యూ, రేషన్ కార్డులు, స్థానిక సమస్యలపై దరఖాస్తులు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. కాగా, గ్రామ సభల్లో కేవలం ఆరు గ్యారెంటీల దరఖాస్తులే స్వీకరిస్తారని వార్తలు వచ్చాయి.
అలాగే, సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. నూతన అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటు చేస్తామన్నారు. డిపెండెంట్ కార్మికులకు డబ్బులు ఖర్చు కాకుండా ఉద్యోగాలు వచ్చే విదంగా కృషి చేస్తామని వివరించారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.