పాకిస్థాన్‌ లో ఒక్క గుడ్డు రూ.32..!

-

పాకిస్తాన్ లో కోడిగుడ్ల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. పౌల్ట్రీలో ఉపయోగించే సోయాబీన్ సరఫరా తగ్గిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. డజన్ గుడ్లు రూ. 360 నుంచి రూ. 289 వరకు అమ్ముతున్నారు. దీంతో ఒక్కో గుడ్డు ధర రూ. 32కు చేరింది. దీనిపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ధరల కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇటు ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతున్నట్టు పాక్ బిజినెస్ ఫోరం తెలిపింది.

Egg prices smash previous records in pakisthan

ఇక ఇండియాలోనూ సామాన్యులకు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. కొండెక్కింది కోడిగుడ్డు ధర. ఆల్‌టైం హై రికార్డు నమోదు చేసింది కోడిగుడ్డు ధర. కార్తీ క మాసం ముగియడం, చలికాలం కావడంతో కోడిగుడ్ల ధరలు పెరిగిపోతున్నాయి. ఇవాళ విశాఖ మార్కెట్ లో 100 గుడ్ల ధర రూ. 580, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ. 584గా నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ఖరారు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version