పారిశుద్ధ కార్మికురాలి స్థలం కబ్జా చేసిన ఎమ్మెల్యే దానం అనుచరులు

-

పారిశుద్ధ కార్మికురాలి స్థలాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు కబ్జా చేశారని పారిశుద్ధ కార్మికురాలు నారాయణమ్మ ఆరోపించింది. దానం నాగేందర్ మనుషుల నుండి తనను కాపాడండి రేవంత్ రెడ్డి సారు అని సదరు మహిళ వేడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానం నాగేందర్ అనుచరులు తనను చంపాలి చూస్తున్నారని సీఎం రేవంత్‌కు పారిశుద్ధ కార్మికురాలు విజ్ఞప్తి చేసింది.

గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలాన్ని కబ్జాకు యత్నించడమే కాక తనపై దాడులకు తెగబడుతూ కేసుల పాలు చేస్తున్న వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలంటూ సీఎం‌కు బాధితులు విజ్ఞప్తి చేసింది.దయనీయ పరిస్థితిలో ఉన్న తనకు అప్పటి ప్రభుత్వం ఫిలింనగర్ వినాయక నగర్లో 120 గజాల స్థలాన్ని కేటాయించిందని.. సదరు స్థలంలో ఎంతోకాలంగ జీవిస్తున్న తమను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు స్థలాన్ని ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేసింది.

 

తనకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా న్యాయం చేయలేదని కన్నీరు పెట్టుకున్నది.న్యాయం కోసం తిరుగుతుంటే తనపైనే కేసులు బనాయిస్తున్నారని..ఫిలింనగర్ బస్తీల్లో స్థలాల పంపిణీ పేరుతో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టడంతో పాటు తనకు న్యాయం చేయాలని రేవంత్‌ను నారాయణమ్మ వేడుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news