ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకున్న హరీష్ రావు..!

-

ఖైరతాబాద్ మహా గణపతికి భక్తుల రద్దీ పెరుగుతుంది. ఈరోజు ఆదివారం సెలవు దినంతో పాటు చివరి రోజు కావడంతో భారీగా భక్తులు వస్తున్నారు. నాలుగు వైపుల నుండి వేల సంఖ్యలో వస్తున్నారు భక్త జనం. ఈ క్రమంలో ఖైరతాబాద్ గణేష్ ను BRS ఎమ్మెల్యే హరీష్ రావు కూడా దర్శించుకున్నాడు. ఈ క్రమంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా ఇక్కడికి వస్తున్న ప్రజలకు శుభాకాంక్షలు. ప్రపంచం లోనే పెద్ద విగ్రహం పెట్టిన చరిత్రలో మన ఖైరతాబాద్ గణేష్ ది.

భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయులది. ఈ సంస్కృతి నీ రాబోయే తరాల వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది.ఆనాడు బలా గంగాధర్ తిలక్ భారతీయులను ఒక్క తాటిమీదికి తేవడానికి వినాయక చవితి దేశ వ్యాప్తంగా నిర్వహించేలా చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అందరూ కలిసి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. గత 9 ఏళ్లు కేసీఆర్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాం. అదే విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి అని హరీష్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version