సంజూ శాంసన్‌కు కోపమొచ్చింది.. గాలిలోకి బ్యాట్ ఎగిరింది..!

-

గాల్లోకి బ్యాట్ విసరారు సంజూ శాంసన్. IPL2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్‌ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఓపెనర్లు నిలకడగా 11 ఓవర్లకు స్కోర్‌ 92 ఆడుతున్న సమయంలో ఫెర్గూసన్ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి సంజుశాంసన్‌ (38) పరుగుల వద్ద వెనుదిరిగాడు. కాగా ఔటైన ప్రస్టేషన్‌లో శాంసన్ తన బ్యాటును గాల్లోకి విసిరాడు. ప్రస్థుతం ఈ విడియో వైరల్‌గా మారింది.

Everyone shocked when angry Sanju Samson threw his bat in air after getting out |

ఇది ఇలా ఉండగా, పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 205 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 67, శాంసన్ 38, రియాన్ పరాగ్ 43, నితిష్ రాణా 12, హిట్మేయర్ 20, జురెల్ 13 పరుగులు చేయడంతో రాజస్థాన్ భారీ స్కోర్ సాధించింది. ఇక 206 పరుగుల లక్ష్యానికి బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొలి ఒవర్ తొలి బంతికే వికెట్ కోల్పోవడం విశేషం. మరోవైపు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా రెండు ఫోర్లు బాదిన తరువాత మొదటి ఓవర్ చివరి బంతికి ఔట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్ అద్భుతమైన బంతులు వేసి ఇద్దరి వికెట్లు తీశాడు. పంజాబ్ జట్టు 155/9 స్కోరుకే పరిమితమైంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version