KCR పార్టీ ఉంటుందో లేదో తెలియదు కానీ మా పార్టీ ఎప్పుడు ఉంటుంది : సాంబశివరావు

-

గజ్వేల్ లో తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో పాల్గొన్నారు CPI ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. KCR సమైక్యతదినం, రేవంత్ ప్రజా పాలన దినం ఎవరికోసమో ఎందుకు చెప్పడం లేదు అని అన్నారు. నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టులు చనిపోతే తెలంగాణ వచ్చింది. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మొహిద్దిన్ గద్దర్ వీళ్లంతా కమ్యూనిస్టులే.. వీరందరూ తెలంగాణ కోసం ప్రాణాలర్పించారు అని తెలిపారు.

కమ్యూనిస్టుల ప్రస్తావన లేకుండా చరిత్ర అనుచాలని చూస్తే కమ్యూనిస్టుల ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది. కేసీఆర్ పార్టీ ఇవాళ ఉంటుందో లేదో తెలియదు కానీ మా కమ్యూనిస్టు పార్టీ మాత్రం ఉంటుంది అన్నారు. అలాగే పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే ఇచ్చినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల కోసం పని చేస్తుందిఅని చెప్పిన కూనంనేని సాంబశివరావు.. కౌశిక్ రెడ్డి, గాంధీలను బస్తీమే సవాల్ అని కుస్తీలు పట్టుకోవడానికా ఎమ్మెల్యేలుగా గెలిపించింది అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version