తెలంగాణ రాష్ట్ర స్పీకర్ ప్రసాద్ పైకి పేపర్లు విసిరారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ సమావేశాలలో గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ-కార్ రేస్‌పై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించడంతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
‘మీరు అడుగుతుంది ఒక వ్యక్తికి సంబంధించింది.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి సభ జరుగుతుంది.’ అంటూ స్పీకర్ మండిపడ్డారు. దీంతో స్పీకర్‌పైకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు విసిరారు.
ఇక అటు స్పీకర్ పోడియం మెట్ల పైకి వెళ్లారు హరీష్ రావు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు… స్పీకర్ పోడియం పైకి దూసుకెళ్లారు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు. దీంతో అసెంబ్లీ ఉన్న మార్షల్స్ …బీఆర్ఎస్ పార్టీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక BRS సభ్యుల ఆందోళన తో సభ పది నిమిషాలు వాయిదా పడింది. దళిత స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవమానించారని కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహిస్తున్నారు.