ఇన్ కమ్ టాక్స్ కట్టేవారికి రైతుబంధు ఇవ్వొద్దన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతుబంధుపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి కీలక వాక్యాలు చేశారు. “ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి, వందల ఎకరాల భూమి ఉన్నవారికి రైతుబంధు ఇవ్వడం అసమంజసం.
కేవలం సాగు చేసే వారికే రైతుబంధు ఇవ్వాలి. నిజ మైన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం చేయాలి. రైతు భరోసా విధి విధానాలపై పరిశీలన జరుగుతోం ది” అని తెలిపారు. కాగా నిన్నటి నుంచి రైతు బంధు నిధులు విడుదల అవుతున్నాయి. రైతు భరోసా విధివిధానాలు ఖరారు కాకపోవడంతో పాత పద్దతిలో ఎకరానికి 5 వేల రూపాయల పెట్టుబడి సాయం వేయాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇందులో కొత్త మంది రైతులకు మాత్రమే రైతు బంధు పడింది. మరికొంత మంది రైతులకు పడాల్సి ఉంది.