తెలంగాణ CM రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాయదుర్గం-శంషాబాద్ విమానాశ్రయం మెట్రో విస్తరణ అవసరం లేదని సీఎం రేవంత్ చెప్పినట్లు సమాచారం.
దీనివల్ల రియల్టర్లకే లబ్ధి కలుగుతుందని, ఆ మార్గంలో ఇప్పటికే ORR ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. దానికి బదులు లకిడికపూల్ – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, JBS-ఫలక్నుమా కారిడార్ పూర్తి చేయడం…. దాన్ని పహడి షరీఫ్ మీదుగా ఎయిర్పోర్ట్ వరకు విస్తరించాలని సూచించినట్లు తెలుస్తోంది.
అలాగే, తెలంగాణ మందుబాబులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటు వంటి బెల్టు షాపుల మూసివేతకు ప్లాన్ చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బెల్టు షాపులను క్లోజ్ చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 2, 620 వైన్ షాపులు ఉన్నాయి. అందులో చాలా వరకు కుదించే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. మద్యం దుకాణాల టైమ్ లిమిట్‌ను కుదించే ప్రయత్నాలు కూడా చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో.. తెలంగాణ మందుబాబులు ఆందోళన చెందుతున్నారు.