దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది ఇప్పటికే ఈడీ అధికారులు కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఉదయం పదిన్నర గంటల తర్వాత దిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమెను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈనెల 9నే విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ముందస్తు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఆరోజున విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీకి లేఖ రాశారు. ఈనెల 11న విచారణకు హాజరుకానున్నట్లు చెప్పారు. కవితను ఇవాళ ఈడీ విచారించనున్న నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు హుటాహుటిన దిల్లీ వెళ్లారు. ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ ఎంపీలు దిల్లీ చేరుకోగా.. మరికొందరు బీఆర్ఎస్ నేతలు ఈ ఉదయం దిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version