పాలరాతి శిల్పంలా అదరహో అనిపిస్తున్న మృణాల్..!

-

మృణాల్ ఠాకూర్.. ఈ పేరు అంటే వెంటనే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు ఏమో కానీ సీతారామం హీరోయిన్ సీత అంటే టక్కున గుర్తుపట్టేస్తారు మన తెలుగు ఆడియన్స్.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమా 2022 ఆగస్టు 5వ తేదీన విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత మృణాల్ కూడా భారీగా ఆఫర్లను అందుకుంటుంది. అంతేకాదు నిత్యం సోషల్ మీడియాకు దగ్గరగా ఉంటూ తనదైన శైలిలో వరుస గ్లామర్ ఫోటోషూట్లు షేర్ చేస్తూ మరింత రెచ్చిపోతుంది.

రాంచరణ్.. ఉప్పెన సినిమాతో బంపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సనాతో.. శంకర్ డైరెక్షన్లో రాబోతున్న ఆర్సీ 15 సినిమా పూర్తి అవ్వగానే ఒక సినిమా చేయబోతున్నారు . ఈ సినిమా నవంబర్లో సెట్ పైకి వెళ్లనుంది. ఇందులో మృణాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.. మరొకవైపు మృణాల్, నాని మరొక సినిమాలో నటించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

ఇకపోతే ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఫోటోషూట్లతో యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా ఉప్పొంగే యద ఎత్తులను చూపిస్తూ.. గాగ్రా చోళీ లో శిల్పాల మధ్య పాలరాతి శిల్పం వలె.. చూసిన వారి నోట అదరహో అనిపించేలా తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది. ఆ శిల్పాలు కూడా ఈమె అందం ముందు దిగదుడిపే అన్నట్లుగా తన అందంతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా మృణాల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version