నిజామాబాద్ జిల్లా పలు మండలాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి బోధన్ చెక్కర కర్మాగారం భూములపై కన్నువేశారని, అందుకే బోధన్ చెక్కర ఫ్యాక్టరీపై అకస్మాత్తుగా ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తులం బంగారం ఎప్పుడు ఇస్తారో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
“ప్రపంచం మోదీ సేవలు గుర్తించింది. ఉజ్యల గ్యాస్ కలెక్షన్స్, ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్నాం. నిజామాబాద్లో 30 ఆసుపత్రిల్లో ఆయుష్మాన్ భారత్ అందుబాటులో ఉంది. 5 లక్షల వరకు వైద్యం ఉచితం, రైతులకు ఎకరానికి ఎరువులకు 18 వేల రూపాయల సబ్బిడీ ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం వరి ధాన్యానికి మోదీ ధర పెంచుతున్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది. రిజర్వేషన్లపై రేవంత్రెడ్డికి అవగాహన లేదు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను మోదీ సరి చేస్తున్నారు.” అని అర్వింద్ అన్నారు.