టీఎంసీ ఎమ్మెల్యే బహిరంగంగా హిందువులను బెదిరిస్తున్నారు: ప్రధాని మోదీ

-

సార్వత్రిక ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అగ్రశ్రేణి నాయకులంతా ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వరుస పర్యటనలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్‌ – దుర్గాపుర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఎం నేతలపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

 బంగాల్లోని టీఎంసీ ప్రభుత్వం హిందువులను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. టీఎంసీ ఎమ్మెల్యే ఒకరు హిందువులను బెదిరిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు దేశాన్ని అభివృద్ధి చేయలేవని, ఓట్ల కోసం దేశాన్ని, సమాజాన్ని విభజించటం మాత్రమే చేయగలవని ప్రధాని మోదీ ఆరోపించారు.

 

“నేను నిన్న టీవీలో చూశా. బంగాల్‌లో టీఎంసీ ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగానే బెదిరిస్తున్నారు. హిందువులను కేవలం 2 గంటల్లో భగీరథి నదిలో ముంచేస్తానని అంటున్నారు. ఇదేం భాష. ఇదేం రాజకీయ సంస్కృతి..? హిందువులను ముంచేస్తారా..? నిజంగా బంగాల్‌లో హిందువులపై ఏం జరుగుతోంది..? బంగాల్లో టీఎంసీ ప్రభుత్వం హిందువులను ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చేసినట్లు కనిపిస్తోంది. జైశ్రీరాం అంటే వారికి బాధ కలుగుతుంది. జైశ్రీరాం అంటే వారికి జ్వరం వస్తుంది.” అని మోదీ ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version