కేసీఆర్ చీకటి పాలన 45 రోజుల్లో ముగిసిపోతుంది : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

-

అధికార పార్టీ ప్రజాప్రతినిధులుగా ఉంటూ ప్రజలకు అభివృద్ధి అందించలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మరో 40 రోజుల్లో కేసీఆర్ చీకటి పాలన అంతమవుతుందని తెలిపారు. డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హరీశ్ రావు, కేటీఆర్ తప్ప ఎవరైనా మంత్రులు వాళ్ల సెగ్మెంట్ దాటుతున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో మంత్రులంతా డమ్మీలయ్యారని విమర్శించారు.

రాష్ట్రంలో అమ్మాయిల ఆత్మహత్యలు దురదృష్టకరం. ప్రవళిక, ప్రీతి ఘటనలు భాధాకరం. కేటీఆర్ అధికారం అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రవళిక విషయంలో కేటీఆర్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. చనిపోయిన అమ్మాయిపై ప్రభుత్వం అబాంఢాలు వేస్తోంది. కేసీఆర్ చీకటి పరిపాలన 45 రోజుల్లో ముగిసిపోతుంది. డిసెంబర్​లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. కాంగ్రెస్ నేతలు పదవుల కోసం ప్రభుత్వం కాదు.. ప్రజలకు న్యాయం కోసం పోరాడుతున్నారు. అని కోమటిరెడ్డి అన్నారు.

గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప గత ఇదేళ్లుగా నల్గొండలో అభివృద్ధి లేదని కోమటిరెడ్డి అన్నారు. తాను ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి.. ఇలా ఏ పదవి చేపట్టినా.. అదంతా ప్రజలు, కార్యకర్తల వల్లే సాధ్యమని చెప్పారు. ఒక్కసారి కాంగ్రెస్​కు అవకాశం ఇవ్వాలని కోరారు. నల్గొండను దత్తత తీసుకున్న కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. రూ.3వేల కోట్లతో సెక్రటేరియట్ కట్టిన కేసీఆర్​కు.. ఇళ్లు కట్టడం కష్టంగా మారిందా అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version