కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకే తాను ముక్కలు అని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. లగచర్ల, మల్లన్నసాగర్ లలో భూసేకరణ, దళితులు, గిరిజనుల పట్ల ఈ రెండు పార్టీల విధానం ఒకటేనని పేర్కొన్నారు. ఒకరు అధికారంలో ఉంటే.. మరొకరూ ప్రతిపక్షంలో ఉంటూ ఒకే రకమైన వైఖరితో నాటకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి లేదా లేదన్నారు. లగచర్ల బాధితులకు న్యాయపరంగా సహకారం అందించడంతో పాటు 2013 భూసేకరణ చట్ట ప్రకారం.. వారికి పరిహారం అందేవిధంగా బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు.
2013 భూ సేకరణ చట్ట ప్రకారం.. మల్లన్న సాగర్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని 48 గంటలు నిద్ర చేసిన రేవంత్ రెడ్డి లగచర్లలో మాత్రం ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉండగా.. 2013 చట్టం పనికి రాదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం అర్ధరాత్రుల్లో అడ్డగోలు దాడులు చేసి మల్లన్న సాగర్ రైతులను ఖాలీ చేయిస్తే.. ఇప్పుడు లగచర్లలో రేవంత్ రెడ్డి కూడా లగచర్లలో అదేరకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.