అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలి.. కాళేశ్వరం చైర్మన్ అసహనం

-

కాళేశ్వరం కమిషన్ విచారణ  మళ్లీ  ప్రారంభం అయింది. డిజైన్ మార్పులు, నిర్మాణంలో ప్రత్యక్ష సాక్షులైన ఇంజినీర్లతో పాటు.. పలువురు ఐఏఎస్ ను కమిషన్ విచారించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పనిచేసిన పలువురు డీఈలు, ఏఈలు కమిషన్ ఎదుట హాజరయ్యారు. నిర్మాణం, పనుల వివరాలపై కమిషన్ ఆరా తీసింది. మేడిగడ్డ  బ్లాక్ -7తో పాటు 3 బ్యారేజీల వర్క్ ప్లేస్ మెంట్ల రిజిస్టర్లను కమిషన్ స్వాధీనం
చేసుకుంది.


ఫీల్డ్ లో  జరిగిన పనులకు సంబంధించి రిజిస్టర్లలో ఇంజినీర్ల సంతకాలను కమిషన్ తీసుకుంది. కుంగిన పిల్లర్లకు సంబంధించిన బ్లాక్ -7 రిజిస్టర్లపై సంతకాలు తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్ అయినట్లు కమిషన్ గుర్తించింది. తొలి డ్యామేజీ 2020లోనే జరిగినట్లు గుర్తించి లేఖలు రాసినట్లు కమిషన్కు ఇంజినీర్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version