కేసీఆర్‌, కేటీఆర్‌ నామినేషన్ల ఖర్చు కోసం రూ. లక్ష విరాళం ఇచ్చిన ముఖరా కే గ్రామం

-

అదిలాబాద్‌ జిల్లా ముఖరా కే గ్రామం పింఛనుదారులు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నామినేషన్ల ఖర్చు భరించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. తమ పింఛన్ల నుంచి కొంత సొమ్ము కేసీఆర్‌, కేటీఆర్‌కు అందించారు. ముఖరా కే గ్రామానికి చెందిన వృద్ధులు, వితంతు మహిళలు, వికలాంగులు.. ప్రతి నెల అందుతున్న పింఛన్ల సొమ్ము నుంచి లక్ష రూపాయలు సేకరించారు. సేకరించిన సొమ్మును సర్పంచ్ మీనాక్షికి అందించారు. ఆ నగదును ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్​కు చెరి సగం అంటే ఒక్కొక్కరికి రూ.50వేలు.. తమ పేరు మీద నామినేషన్‌ ఖర్చుల కోసం ఇచ్చి రావాలని సర్పంచిని కోరారు.

గ్రామస్థుల కోరిక మేరకు సర్పంచ్ మీనాక్షి ఎంపీ సంతోష్‌కుమార్‌ సహకారంతో ఆదివారం రోజున కేసీఆర్​ను ప్రగతి భవన్​లో కలిశారు. సీఎం కేసీఆర్‌ను కలిసి పింఛనుదారుల విజ్ఞప్తిని తెలియజేశారు. సీఎం కేసీఆర్‌కు రూ.50వేల చొప్పున రెండు చెక్కులను అందజేశారు సర్పంచ్ మీనాక్షి. అనంతరం తమ గ్రామస్థుల విజ్ఞప్తిని సీఎం వద్ద విన్నవించారు. నగదు అందుకున్న కేసీఆర్.. మంత్రి కేటీఆర్​లు.. ముఖరా కే గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే ఈసారి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version