కొమరంభీం జిల్లాలో అపశృతి..గణపతి క్రేన్ ప్రమాదంలో మున్సిపల్‌ కార్మికుడు మృతి !

-

కొమరంభీం జిల్లా వినాయక నిమజ్జనం లో అపశృతి చోటు చేసుకుంది. ‌కాగజ్‌ నగర్ పెద్దవాగు వద్ద క్రేన్ ప్రమాదంలో ఇద్దరు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు గాయాలు అయ్యాయి. అయితే… తీవ్ర గాయాలైన మున్సిపల్ కార్మికుడు లింగంపల్లి నగేష్ (50) హైదరాబాద్ కు తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు మరో కార్మికుడు. దీంతో నిమజ్జనం విధులను బహిష్కరించింది మున్సిపల్ కాంట్రాక్ట్ సిబ్బంది.

Municipal worker dies in Komarambhim district

అటు ఈ సంఘటనపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ స్పందించారు. కాగజ్ నగర్ వినాయక నిమజ్జన వేడుకల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల లింగంపల్లి నాగేష్ అనే కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందడం, ప్రేమ్ అనే ఇంకొక కార్మికుడు తీవ్రంగా గాయపడడం అత్యంత బాధాకరం అన్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా మునిసిపల్ సిబ్బందిని కేవలం మాట్లాడే పనిముట్లు గా చూడడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నవి తెలిపారు. మృతుడి కుటుంబంలో ఒకరికి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version