మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ను గెలిపించండని కోరారు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ ఈ ఉత్సాహం చూస్తుంటే మీరంతా ఈటల రాజేందర్ ను పార్లమెంట్ కు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు అనిపిస్తుందన్నారు.
మోడీ పాలనలో దేశం సురక్షితంగా ఉంది….పాకిస్థాన్ మన జవాన్ల మీద దాడి చేస్తే సర్జికల్ స్ట్రైక్ చేసి వారిని సాఫ్ చేశాని తెలిపారు. అమెరికా, యూరప్, రష్యా, జపాన్, చైనా, ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది…కానీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. మందుల తయారీలో, పెట్రో కెమికల్స్ లో, స్టీల్ తయారీలో రెండవ స్థానంలో ఉన్నామని.. వాహనాల తయారీలో మూడవ స్థానంలో ఉన్నామన్నారు. దేశంలో ఎవరు ఆకలితో పడుకోకుండా ఉండాలని మోదీ గారు బియ్యం అందిస్తున్నారు….ఉజ్వల ఉజాల యోజన ద్వారా మహిళలకు లాభం జరుగుతుందని వెల్లడించారు.