తెలంగాణ రైతులకు కేంద్రం సంక్రాంతి కానుక..!

-

తెలంగాణ రైతులకు సంక్రాంతి కానుక అందించింది కేంద్ర సర్కార్‌. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డ్‌ ప్రారంభం అయింది. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు కేంద్రమంత్రి పీయూష్‌గోయల్. ఇక ఈ కార్యక్రమానికి జాతీయ పసుపు బోర్డ్‌ చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

National Yellow Board started in Nizamabad

ఈ సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ మాట్లాడారు. పసుపు బోర్డును సరైన దిశలో నడిపించాలన్నారు. పల్లె గంగారెడ్డి పై బృహత్తర బాధ్యతను పెట్టామని తెలిపారు. సంక్రాంతి పర్వదినం రోజున పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డును గిప్ట్ గా ఇచ్చారని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సందర్భంగా మోడీ ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును ఏర్పాటు చేసారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version