నిమ్స్ పేదల ఆలయం.. సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్..!

-

ప్రమాదవశాత్తు ఛాతిలో బాణం దిగి దాదాపు గుండెకు దగ్గరగా చేరిన ఆ బాణంను తొలగించి ఒక ఆదివాసీ యువకుడిని ప్రాణాపాయ స్థితి నుంచి నిమ్స్ వైద్యులు కాపాడారు. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్కు చెందిన గుత్తికోయ గిరిజన తెగకు చెందిన సోది నందాకు ప్రమాదవశాత్తు ఛాతిలో బాణం గుచ్చుకోగా మొదట భద్రాచలం ఏరియా ఆసుపత్రి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు, గాంధీకి రాగా చివరికి నిమ్స్ డాక్టర్లు ఆపరేషన్ చేసి బాణాన్ని తొలగించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు సమాచారం. అయితే నిమ్స్ వైద్యులు అతినిని ప్రత్యేక కేసుగా పరిగణించి ఫ్రీగా ట్రీట్మెట్ చేశారు. దీంతో వైద్యులపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.

cm revanth reddy on may day

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నిమ్స్ వైద్యులపై ప్రసంశలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. గిరిజన యువకుడు సోది నంద ఛాతి భాగంలో దిగిన బాణాన్ని చాకచక్యంగా, అత్యంత నిపుణతతో తొలగించి నిండు ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్య బృందానికి నా అభినందనలు. సామాన్య ప్రజల్లో నిమ్స్ దావాఖాన పట్ల ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారన్నారు. భవిష్యత్లో నిమ్స్ మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించి, పేదల దేవాలయంగా పేరు తెచ్చుకోవాలని కోరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version