రేవంత్ రెడ్డిని ఎవరూ నమ్మరు.. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్

-

ప్రతి రైతులో కేసీఆర్ ఉన్నాడు.. అందుకే రేవంత్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు.  రేవంత్ రెడ్డిని ఎవరూ నమ్మరని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.  అబద్ధాలకు మారుపేరు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారు. రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఓట్టు వేసినందుకు ఇన్ని రోజులు నమ్మారు.. కానీ ఇక నుంచి రేవంత్ రెడ్డిని ఎవరూ నమ్మరు అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అందరూ మమ్మల్ని కాపాడండి అని పేర్కొంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులు అంటే కేవలం ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి పరిస్థితులే లేవు అన్నారు. బీఆర్ఎస్ రైతుల ప్రభుత్వమని పేర్కొన్నారు.  ఇంత సంస్కార హీనమైన ముఖ్యమంత్రి చరిత్రలో ఉండడు అన్నారు. తెలంగాణ చరిత్ర దీనిని క్షమించదు. ఇంత మూర్ఖత్వంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లాగా మాకు మాట్లాడరాదు.. ఎందుకంటే ఆయన కేవలం బూతులు మాట్లాడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version