తెలంగాణలో అధికార కాంగ్రెస్-ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేటీఆర్ నిన్న ఢిల్లీకి వెళ్లడంతో రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ కి వెళ్లారని విమర్శించారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగింది అనేది పెద్ద జోక్ అని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి సృజన్ రెడ్డి తోక చుట్టం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత-సృజన్ రెడ్డి వ్యాపార భాగస్వాములు అని తెలిపారు. పాలమూరు టన్నెల్ పనులను వారిద్దరే చేశారు. దీనికి కేటీఆరే సమాధానం చెప్పాలి. అధికారులపై దాడులు, అమృత్ టెండర్లలో అవినీతి అని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేటీఆర్ ను ఎవ్వరూ పట్టించుకోలేదని సెటైర్లు వేశారు. కేటీఆర్ నగరానికి తెచ్చింది ఒరిజినల్ ఫార్ములా-1 కాదని ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి.