ఆర్టీసీలో 3వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2వేలకు పైగా డ్రైవర్, వెయ్యికి పైగా కండక్టర్ పోస్టులతో పాటు 200కు పైగా సూపర్వైజర్ స్థాయి పోస్టులను బట్టి చేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి మూడో వారంలో లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలోపు ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇది ఇలా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాలంలో మరో సంఘటన తెరపైకి వచ్చింది. అమ్మకానికి స్టాఫ్ నర్సు ఉద్యోగాలు పెట్టారు. రూ.3 లక్షలకు ఒక పోస్ట్ చొప్పున స్టాఫ్ నర్సు ఉద్యోగాలు అమ్మేస్తున్నారు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.
స్టాఫ్ నర్సు ఉద్యోగ నియామకాలు చేపట్టగా వరంగల్ జిల్లా నుంచి 706 మంది ఉద్యోగాలు పొందారు. అందులో కాకతీయ మెడికల్ కాలేజ్ ఆవరణలోని పీఎంఎస్ఎస్‌వై సూపర్ స్పెషలిటీ హాస్పిటల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా చేస్తున్న వారిలో 18 మంది ప్రభుత్వం ఎంపిక చేసిన వారిలో ఉన్నారు. ఆ 18 మంది నర్సుల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఒక్కో పోస్టుకు రూ.3 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం.