మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వరుసగా రెండో రోజు కూడా జలదిగ్భంధంలో ఉండిపోయింది. ముఖ్యంగా మంజీరా బ్యారేజీ, నక్క వాగు నీటి విడుదలతో వనదుర్గ మాత ఆలయ గర్భ గుడి లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆలయాన్ని మూసివేశారు. ఈనెలలో కురిసిన భారీ వర్షాలకు ఇది వరకే దాదాపు 12 రోజుల పాటు ఆలయాన్ని మూసివేశారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రాజగోపురంలో విగ్రహం ఏర్పాటు చేసి పూజలు కొనసాగిస్తున్నారు. ఆలయం వద్ద మంజీరా నది వరదకు నక్క వాగు ప్రవాహం తోడు కావడంతో ఉదృతంగా మారింది. మరో వైపు సింగూరు ప్రాజెక్ట్ వరద కొనసాగుతోంది. ఒక గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సింగూర్ ప్రాజెక్ట్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని కూడా కొనసాగిస్తున్నారు.