నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. ఏజ్ లిమిట్ పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ

-

రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భ‌ర్తీకి సిద్ధ‌మైన ప్ర‌భుత్వం వ‌యో ప‌రిమితికి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం వ‌యో ప‌రిమితిని పెంచుతూ కేసీఆర్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అంతే కాకుండా.. దానికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను కూడా శ‌నివారం రాత్రి జారీ చేసింది. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల అప్లికేషనకు గ‌రిష్ట వ‌యో ప‌రిమితి 34 ఏళ్లు ఉండేది.

తాజా గా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. గ‌రిష్ట వ‌యో ప‌రిమితి 44 ఏళ్లు కు పెరిగింది. కాగ వ‌యో ప‌రిమితి పెంపు రెండేళ్ల పాటు ఉంటుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. త‌ర్వాత గ‌రిష్ట వ‌యో ప‌రిమితి 34 ఏళ్లే గానే ఉంటుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ ఉత్త‌ర్వుల్లో తెలిపింది. అయితే ఈ వ‌యో ప‌రిమితి సండ‌లింపులు.. పోలీసు, అట‌వీ శాఖ‌, అగ్ని మాప‌క శాఖ ల్లో ఉన్న ఉద్యోగాలు వ‌ర్తించ‌దు.

కాగ తెలంగాణ రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలు ఉన్నాయ‌ని సీఎం కేసీఆర్ ఆసెంబ్లీలో ప్ర‌క‌టించారు. అందులో 80,039 ఉద్యోగాల‌ను నోటిఫికేషన్ల వేసి భ‌ర్తీ చేస్తామ‌ని తెలిపారు. మిగిలిన‌వి కాంట్రాక్ట్ ఉద్యోగాల రెగ్యుల‌రైజేషన్ కోసం ఉంటాయ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version