ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటే చేతి గోళ్ళల్లో సమస్యలు… లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

-

ఈ మధ్య కాలం లో అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువై పోయాయి. హృదయ సంబంధ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు లాంటివి బాగా ఎక్కువై పోయాయి. లంగ్ క్యాన్సర్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

 

ఊపిరితిత్తుల క్యాన్సర్ చాలా త్వరగా వ్యాపిస్తుంది. అయితే ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చిందని ఎలా తెలుస్తుంది..? దీనిని ఎలా గుర్తించాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈరోజు మనం చూద్దాం.

చేతి మీద కలిగే లక్షణాలు:

గోర్లు కొంచెం విచిత్రంగా కనబడతాయి. ముఖ్యంగా వాటి యొక్క ఆకారం మారుతుంది.
వేళ్ళ పై భాగం ఎఫెక్ట్ అవుతుంది.
కాలి గోర్లలో కూడా మార్పు రావచ్చు.
ఇలా ఫింగర్ క్లబ్ జరిగితే అది ఊపిరితిత్తుల క్యాన్సర్ అని మనం కనిపెట్టొచ్చు.
ఇలా ఫింగర్ క్లబ్ జరగడం వల్ల క్యాన్సర్ వ్యాపించింది అని మనం గుర్తించవచ్చు అని రీసెర్చర్లు అంటున్నారు.
అలానే గోర్లు చాలా మృదువుగా మారి పోతాయి.
గోర్లు లేచినట్లుగా అనిపిస్తాయి. అలానే గోర్లు యొక్క ఆకారంలో కూడా మనం మార్పును చూడొచ్చు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క మరి కొన్ని లక్షణాలు:

దగ్గు ఎక్కువ రావడం
ఛాతి లో నొప్పి
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
దగ్గినప్పుడు రక్తం రావడం
అలసటగా అనిపించడం
బరువు తగ్గడం

ఉపిరితిత్తులు క్యాన్సర్ సమస్యను ఎలా తగ్గించుకోవాలి..?

ధూమపానానికి దూరంగా ఉండండి:

ధూమపానం మీరు చేయొద్దు. అలానే ఎవరైనా చేస్తుంటే వాళ్లకు దూరంగా వుండండి.
పని చేసుకునే టప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు పనులు చేసుకునే టప్పుడు కార్సినోజెన్స్ కి దూరంగా ఉండండి.
అలానే సిమెంట్, దుమ్ము, ధూళి వంటి వాటికి కూడా దూరంగా ఉండండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. దానితో ఏ సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉండచ్చు. ఉపిరితిత్తులు క్యాన్సర్ సమస్య కూడా లేకుండా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version