పోలియో ను తరిమి కొట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు అలాగే ప్రజాప్రతినిధులకు మంత్రి హరీష్ రావు సూచనలు చేశారు. పోలియో కార్యక్రమం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని… పల్స్ పోలియో లో భాగంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆయన చెప్పారు.
ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు ఇతర ప్రాంతాలలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రేపు ఉదయం ఎనిమిది గంటల సమయం నుంచి రాత్రి 8 గంటల సమయం వరకు పోలియో చుక్కలు వేస్తారని వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా పోలియో చుక్కలు వేయించుకోక పోతే… సోమవారం రోజున ఉదయం కూడా పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్ రావు తెలిపారు.. రేపు దాదాపు 38 లక్షల చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు.