తెలంగాణలో అన్నీ పెద్ద కుంభకోణాలే వినిపిస్తున్నాయి: పవన్‌ ఖేరా

-

హైదరాబాద్‌లో ఇవాళ్టి నుంచి రెండ్రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల కోసం ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే, ఇతర ప్రముఖ నేతలు హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ మీడియా విభాగం ఇంఛార్జ్ పవన్ ఖేర్ హైదరాబాద్‌ హోటల్‌ తాజ్‌ కృష్ణాలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాది హైదరాబాద్​లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల థీమ్‌..  ‘భారత్ జుడేగా… ఇండియా జీతేగా’ అని పవన్‌ ఖేరా ప్రకటించారు.

సీడబ్ల్యూసీలో స్వేచ్ఛా పూర్వక వాతావరణంలో చర్చ జరుగుతుందని పవన్ ఖేరా అన్నారు. ఇదే తమ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం అని తెలిపారు. ఐదు రాష్ట్రాల, లోక్ సభ ఎన్నికల ముందు జరుగుతున్న సమావేశ నిర్ణయాలను సాయంత్రం వెల్లడిస్తామని చెప్పారు. తెలంగాణలో అన్నీ పెద్దపెద్ద కుంభకోణాలే వినిపిస్తున్నాయని అన్నారు.  ధైర్యంగా ముందుకు వస్తే అన్ని కుంభకోణాల గురించి మాట్లాడదామని తెలిపారు.  కేంద్రంతో ఎలా పోరాడుతున్నామో కవితకు తెలియదా అని పవన్ ప్రశ్నించారు. గౌతం అదానీ గురించి కవిత ఎందుకు మాట్లాడరని విమర్శలు గుప్పించారు. సమస్యలు, ఇతర అంశాల నుంచి దృష్టి మళ్లించడానికే జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version