ప్రజలు బంగారం పెట్టిన తినరు.. ఎమ్మెల్యే కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు

-

ప్రజలు బంగారం పెట్టినా తినరు అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం,స్వేచ్ఛ,వాక్ స్వాతంత్య్రం,భావస్వేచ కోరుకున్నారు కాబట్టే 10 ఏళ్ల రాచరిక పాలనకు చరమగీతం పాడారు. ప్రజలు వారి బాధలు చెప్పుకోవడానికి,ఆ బాధలను వినే నాయకులను ఇష్టపడతారు. అభివృద్ధి మాత్రమే చేస్తాం మీకు కలవాల్సిన అవసరం లేదనేది రాచరిక పోకడ అన్నారు.

అది ముమ్మాటికీ BRS అవలంబించింది అని.. కాంగ్రెస్ పార్టీ కొన్ని నమ్మదగ్గ హామీలు ఇచ్చింది అని.. కేసీఆర్ హామీలను ప్రజలు నమ్మలేదు అన్నారు. బీజేపీ,BRS పార్టీల లింకును మేము బయటపెట్టి ,ఓడించాలనుకున్నాం. అందుకే చివరి నిమిషంలో కాంగ్రెస్ తో ఒక్క సీటు ఇచ్చినా పొత్తు పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ,టీడీపీ,న్యూడెమోక్రసీ, సీపీఎం,జనసమితి పార్టీలు మనస్ఫూర్తిగా పనిచేశాయి. సీపీఎం పార్టీ 19 స్థానాల్లో పోటీ చేసి సీపీఐ ని కూడా కలుపుకొని,మావి 20 స్థానాల్లో పోటీ అనడం ఆ పార్టీ యొక్క నిజాయితీని చూపెట్టింది. ఈ గెలుపు ఒక్క సీపీఐ పార్టీదే కాదు.

ప్రశ్నించే గొంతుక అసెంబ్లీ లో ఉండాలని అనుకున్న ప్రతి ఒక్కరిది. పేదవాడి గొంతుక వినిపించాలని అనుకున్న వారు,న్యాయం కోసం నన్ను ఆదరించారు. ఇంకా చాలా మంది కమ్యూనిష్టులు ప్రశ్నించేందుకు అసెంబ్లీ లో ఉండాలనుకున్నారు కానీ నాకు ఒక్కడికే అవకాశం వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version