ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందించారు. తమ కార్యకర్తలు చాలా కష్టపడ్డారని తెలిపారు. ఓటమి నుంచి నేర్చుకొని ముందుకు సాగుతామన్నారు. ఢిల్లీ ప్రజల శ్రేయస్సు కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఆప్ సర్కార్ పై ప్రజలు విసిగిపోయి ఉన్నారని.. మార్పు కోరుకున్నారని వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ కంగ్రాట్స్ చెబుతూ ఓడిన వారు మరింత కష్టపడాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా ఢిల్లీ ప్రజల తరపున తమ పోరాటం కొనసాగిస్తామని ప్రియాంక గాంధీ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ గట్టిగానే పని చేసిందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు.