ఢిల్లీ ప్రజలు అభివృద్ధి, సుపరిపాలనకు ఓటు వేశారు : ప్రధాని మోడీ

-

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ  ఘన విజయం సాధించింది. 12 ఏళ్ల ఆమాద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ  ప్రజలు చరమగీతం పాడారు. తాజా సమాచారం మేరకు 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 23 స్థానాల్లో ఆమాద్మీ
పార్టీ  అభ్యర్థులు లీడ్ లో  కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 47 శాతం ఓట్
షేర్ సాధించి ఆగ్ర స్థానంలో నిలిచింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా , మంత్రులు ఘోర ఓటమి చవిచూశారు.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. “జనశక్తి ప్రధానం. అభివృద్ధి, సుపరిపాలనను గెలిపించారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని అందించిన ఢిల్లీలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు సెల్యూట్. ఢిల్లీని అభివృద్ది చేయడంలో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో వికసిత్ భారత్ ను నిర్మించడంలో ఢిల్లీ ప్రధాన పాత్ర పోషించే విధంగా పని చేస్తామని హామీ ఇస్తున్నాం” అని ట్వీట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version