కామారెడ్డి ప్రజలు కేసీఆర్ కి పెద్ద సినిమా చూపిస్తారు : షబ్బీర్ అలీ

-

కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. కాంగ్రెస్ ఆకాశం లాంటిది. ఆకాశం పై ఉమ్మితే మీపైనే పడుతుంది అంటూ కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పేరు దుబాయ్ కేసీఆర్.. దుబాయ్ ఏజెంట్ కొడుకు నా పై మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల డబ్బుతో 4 హెలికాప్టర్ లలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

హెలికాప్టర్ లో తిరగడానికి డబ్బులు ఎక్కడివి..? ఈ అంశంపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం.. మిగతా మంత్రులకు హెలికాప్టర్లకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఊసరవెళ్లిలా డబుల్ గేమ్ ఆడుతారు. 2004 ఎన్నికల్లో కేసీఆర్ నన్ను ఓడించాలని చూశారని షబ్బీర్ అలీ ఆరోపించారు. మంత్రి కేటీఆర్ కి చరిత్ర తెలియదని పేర్కొన్నారు షబ్బీర్ అలీ. సీఎం కేసీఆర్ కంటే.. తొమ్మిదేళ్ల ముందు మంత్రి అయ్యానని.. నాపై ఒక్క అవినీతి ఆరోపణలు లేవు.. అది షబ్బీర్ అలీ అంటే.. కేసీఆర్, కేటీఆర్ పై ఈడీ, సీబీఐ కేసులున్నాయి. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కల్వకుంట్ల ఫ్యామిలీ అని ఆరోపించారు. బీఆర్ఎస్ ఆఫీస్ లోనే దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version