మన దాయాది దేశమైన పాకిస్థాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోయాయి. పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ కొనాలంటే రూ.147 చెల్లించాల్సిందే. అలాగే.. డీజిల్ కొనాలంటే.. రూ.144 ఇవ్వాల్సిందే. ప్రభుత్వం ఇంధన ధరలను రూ.3 మేర పెంచిది. జనవరి 15 వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. దీంతో అక్కడి ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని.. చెప్పుకోవచ్చు. రానున్న కాలంలో మరోసారి ధరల పెంపు ఉండొచ్చని అక్కడి మీడియా చెబుతోంది.
ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చమురు ధరల విషయానికి వస్తే… వాటి ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20 వద్దనే కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర రూ.94.62 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది. గుంటూరు అమరావతిలో కూడా పెట్రోల్ ధర ఇదే దారిలో నడిచింది. రేటులో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ రేటు లీటర్ కు రూ.110.67 వద్దనే స్థిరంగా ఉంది. డీజిల్ రేటు లీటర్ కు రూ.96.08 గా కొనసాగుతోంది.