తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వర్చవల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 6 రోజుల పాటు నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఒక్క గురువారం రోజు మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పారు.
ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 100 శాతం కన్నా ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తోంది. కొత్త వందేభారత్ సాధారణ సేవలు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు మార్చి 13 నుంచి, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు మార్చి 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల పట్ల మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అంతర్జాతీయ ప్రమాణాలతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దక్షిణమధ్య రైల్వేలో ప్రస్తుతం 3 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయ వెల్లడించారు.