అవినీతిలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్‌ బంధం: ప్రధాని మోదీ

-

బీజేపీకి దేశమే తొలి ప్రాధాన్యత అని ప్రధాని మోదీ అన్నారు. కానీ కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలకు మాత్రం కుటుంబమే తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. కుటుంబం వల్ల, కుటుంబం చేత, కుటుంబం కోసం నినాదంతో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్  రెండూ ఒకటే.. నాణేనికి బొమ్మ, బొరుసు వంటివన్న ప్రధాని.. ఆ రెండు అవినీతి పార్టీలేనని ఆరోపించారు. హస్తం, గులాబీ పార్టీలను అవినీతే అనుసంధానం చేస్తోందని విమర్శించారు. వేములవాడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు.

“తెలంగాణ ప్రజల స్వప్నాన్ని రెండు పార్టీలు కాలరాశాయి:. తెలంగాణ ఏర్పడితే ప్రజల కలలు సాకారమవుతాయని అందరూ భావించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టుపెట్టి కుటుంబ లబ్ధి కోసమే బీఆర్ఎస్ పనిచేసింది. స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్‌ కూడా కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసింది. వంశపారంపర్య రాజకీయాలతో కాంగ్రెస్‌ దోపిడీ చేసింది. మాజీ ప్రధాని పీవీని కూడా కాంగ్రెస్‌ అవమానించింది. పీవీ పార్థివదేహాన్ని పార్టీ కార్యాలయంలోకి అనుమతించలేదు. అవినీతిలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్‌ బంధం. ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు. తెరవెనుక మాత్రం అవినీతి సిండికేట్‌గా మారుతారు” అని మోదీ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version