Telangana : 29కి చేరిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్లు

-

తెలంగాణ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్‌ వేశారు. దీంతో వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఇప్పటి వరకు నామినేషన్‌ వేసిన అభ్యర్థుల సంఖ్య 29కి చేరింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి తరఫున ఇప్పటికే ప్రతిపాదకులు నామినేషన్‌ దాఖలు చేయగా…మంగళవారం రోజున మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కలిసి ఆయన మరోసెట్‌ నామినేషన్‌ వేశారు.

శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్‌, స్వతంత్ర అభ్యర్థులుగా పిడిశెట్టి రాజు, పూజారి సత్యనారాయణ, భీమా గుగులోతు, డాక్టర్‌ పెంచాల శ్రీనివాస్‌, కంటే సాయన్న, అల్వాల కనకరాజులు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌.మహేందర్‌కు నామపత్రాలు సమర్పించారు. బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. రేపటి (మే 9వ తేదీ)తో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version