కేసీఆర్ జీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా : ప్రధాని మోదీ

-

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. ఆయన తన నివాసంలో కాలుజారి పడటంతో తుంటి ఎముక విరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి కేసీఆర్​ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్స చేయాలో వద్దోనన్న విషయంపై నిర్ణయం తీసుకుంటామని యశోద వైద్యులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్​ను పరామర్శించేందుకు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. మరోవైపు పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ఆరోగ్యంపై తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్ ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. ఆయనకు గాయమైందని తెలిసి బాధగా ఉందని.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్​లో పేర్కొన్నారు.

మరోవైపు కేసీఆర్ ఆరోగ్యంపై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌ చికిత్స పొందుతున్నారని.. అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని కవిత పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version